Ram Gopal Varma has said that JD Chakravarthy is not acting as Nara Chandrabu Naidu in his Lakshmi's NTR cinema.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి వివాదాలతోనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అంతేగాక, ఈ సినిమాలో పాత్రలపైనా విస్తృత చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో రోజుకో కొత్త విషయం చెబుతూ సినిమాపై ఆసక్తి పెంచాలని చూస్తున్నారు వర్మ.
తాజాగా, తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'లో అత్యంత కీలకమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జేడీ చక్రవర్తి పోషించనున్నాడని వచ్చిన వార్తలపై వర్మ స్పందించారు.తన చిత్రం(లక్ష్మీస్ ఎన్టీఆర్)లో చంద్రబాబు పాత్రను జేడీ పోషించడం లేదని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా జేడీ ఆ పాత్రను పోషించడం లేదని వ్యాఖ్యానించారు.