Surprise Me!

ప్రభాస్.. ఏంటీ స్లో.. రానా చూడు రాకెట్ లా..!

2017-12-05 209 Dailymotion

After Baahubali, Prabhas, Rana Daggubati become house hold names in Indian film Industry. After Baahubali, Rana selecting like 1945, King of Travancore, Hathi mere Saathi remake.

బాహుబలి ది బిగినింగ్, బాహుబలి2 ది కన్‌క్లూజన్ చిత్రాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ హీరో రానా దగ్గుబాటికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాల కంటే ముందే రానా బాలీవుడ్‌ ప్రేక్షకులకు రానా పరిచయం. కానీ కేవలం బాహుబలితోనే ప్రభాస్ హిందీ, ఇతర రంగాలకు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ ఇద్దరి హీరోలకు సంబంధించిన కెరీర్ గ్రాఫ్ చూస్తే ప్రభాస్ స్లో అండ్ స్టడీలా కనిపిస్తుంటే.. రానా మాత్రం విభిన్నమైన చిత్రాలతో శరవేగంగా దూసుకెళ్తున్నాడు.
బాహుబలి రిలీజై ఆరునెలలకు పైగా కావోస్తున్నా ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ రానా మాత్రం వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. బాహుబలి తర్వాత ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో రానా ఆలరించాడు. వరుస హిట్ల తర్వాత డిఫరెంట్ కథాంశంతో చిత్రాలను ఎంపిక చేసుకొంటూ జాతీయ మీడియాను ఆకర్షిస్తున్నాడు.
1945, హాథీ మేరా సాథీ రీమేక్, మరట్వాడా రాజా బయోపిక్ చిత్రాలను రానా దగ్గుబాటి ఇటీవల అంగీకరించాడు. ఈ చిత్రాలను చూస్తే రానా పక్కా ప్రణాళికతోనూ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ మూడు చిత్రాలు కూడా వేటికి అవే విభిన్నంగా కనిపిస్తున్నాయి.