Shruti Haasan attended the wedding of actor Aadhava and Vinodhinnie. The actress was accompanied to the function by her dad Kamal Haasan as well as her rumoured boyfriend Michael Corsale and looked stunning.
హీరోయిన్ శృతి హాసన్ కొంతకాలంగా మైఖేల్ కోర్సల్ అనే విదేశీయుడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నరంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మైఖేల్‌ను ఇప్పటికే తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికలకు పరిచయం చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
తాజాగా శృతి హాసన్, మైఖేల్ కోర్సెల్ కలిసి చెన్నైలో జరిగిన నటుడు అధవ్, వినోదిని పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు పంచెకట్టులో హాజరైన మైఖేల్.... కమల్ హాసన్‌తో కలిసి కనిపించడం గమనార్హం.
మైఖేల్ కోర్సల్ కొన్ని రోజులుగా తన ప్రియురాలు శృతి హాసన్ తో కలిసి ఇండియాలోనే ఉంటున్నారు. ఇపుడు ఏకంగా తమిళ సాంప్రదాయ దుస్తువుల్లో శృతి హాసన్, కమల్ హాసన్‌తో కలిసి పెళ్లి వేడుకకు హాజరు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నటుడు కమల్ హాసన్ చాలా అభ్యుదయ భావాలు కలిసిగిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. తన ఇద్దరు కూతుళ్లకు ప్రతి విషయంలో కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చిన ఆయన శృతి హాసన్ ప్రేమ, పెళ్లి విషయంలో కూడా నిర్ణయం ఆమెకే వదిలేశాడట.