Surprise Me!

సల్మాన్ ఖాన్‌‌ షూటింగ్ రద్దు ! 'చంపేస్తాం' అంటూ బెదిరింపులు..!

2018-01-11 1 Dailymotion

A man from Bishnoi community has threatened to kill Salman Khan. The shooting of Race 3 had to be stopped and cops escorted Salman from the sets to his residence. Gangster Lawrence Bishnoi warned “Salman Khan will be killed here, in Jodhpur... Then he will come to know about our real identity.


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని కొందరు అగంతకులు బెదిరింపులకు పాల్పడటం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బెదిరింపుల కారణంగా రేస్3 షూటింగ్ రద్దు చేశారు. పోలీసుల రక్షణతో సల్మాన్‌ను తన నివాసానికి తరలించారు. బెదిరింపులకు పాల్పడిన వారెవరూ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణ జింకలను ఆరాధించే బిష్ణ్నోయి కమ్యూనిటికి చెందిన గ్యాంగస్టర్ లారెన్స్ బిష్నోయి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పదేళ్ల క్రితం జోధ్‌పూర్‌లో క‌ృష్ణ జింకలను వేటాడిన విషయంలో సల్మాన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్‌లో చంపేస్తాం. అప్పుడే మా కమ్యూనిటి సత్తా ఏమిటో తెలుస్తుంది. ఏదైనా పెద్ద నేరం చేయాలని పోలీసులు భావిస్తే వెంటనే నేను సల్మాన్ ఖాన్‌ను చంపేస్తా. అది కూడా జోధ్‌పూర్‌లోనే అని లారెన్స్ బిష్నోయి హెచ్చరికలు జారీ చేశారు. లారెన్స్‌పై దాదాపు 20కిపైగా హత్యాయత్నం, కార్ల హైజాక్, గొలుసు దొంగతనాలు, తదితర కేసులు నమోదయ్యాయి.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలో రేస్3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సల్మాన్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చి నేపథ్యంలో ముంబై ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రేస్3 షూటింగ్ ప్రాంతానికి పోలీసులు చేరుకొని నిర్మాత రమేష్ తురానీకి ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతో నిర్మాత వెంటనే షూటింగ్‌ను నిలిపివేశారు.