Surprise Me!

రకుల్-రానా ఏంటీ సంగతి ! నిజంగానే విషయం అక్కడిదాకా వెళ్లిందా?

2018-01-29 1 Dailymotion

Rakul Preet Singh is the most sought after heroine in Tollywood now, she reacted on the rumours about love affair with Rana Daggubati

సెలబ్రిటీలను రీల్‌పై చూడటం ఎంత ఆసక్తో.. రియల్ లైఫ్‌లో వాళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్యూమ్స్ దగ్గరి నుంచి ఎఫైర్స్ దాకా వాళ్ల ప్రతీ కదలిక వార్తే. ఏమాత్రం లీక్ దొరికినా సరే.. వాళ్ల ప్రేమాయణాల గురించి మీడియా కోడై కూస్తుంది. కొంతమంది హీరో, హీరోయిన్లు వీటిని చూసీ చూడనట్లు వదిలేస్తారు. మరికొంతమంది మాత్రం గట్టి వార్నింగులే ఇస్తారు. ఈ రెండింటిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఏ కోవకు చెందినదో తెలుసా?..
రానా-రకుల్ మధ్య ఏదో జరిగిపోతుందన్న ఊహాగానాలు ఇండస్ట్రీలో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, చాలాచోట్ల జంటగా కనిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు కాబట్టే.. ఎక్కడికెళ్లినా జంటగా వెళ్తున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి.
రకుల్ సంగతి పక్కనపెడితే.. రానా విషయంలో ఇదేమి కొత్త కాదు. హీరోయిన్ త్రిష-రానాల మధ్య ఏదో ఉందనే ప్రచారం ఇప్పటికీ తెరపైనే ఉంది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో.. 'త్రిషతో డేటింగా.. రానా ఒప్పుకోడు' అని అఖిల్ చేసిన కామెంట్స్ కూడా దీనికి బలం చేకూర్చాయి. అయితే అటు రానా గానీ, ఇటు త్రిష గానీ దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు.
రకుల్‌తో ప్రేమాయణం అన్న గాసిప్స్ గురించి రానా పెద్దగా పట్టించుకోవట్లేదట. రానా వీటన్నింటిన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడని, తనతో సరదాగా షేర్ చేసుకుంటాడని రకుల్ చెబుతోంది. తాను కూడా ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకుంటానని, రానాతో చెప్పి నవ్వుకుంటానని అంటోంది.
ఆమధ్య రకుల్ ప్రీత్ సింగ్‌కు ఓ హీరో హైదరాబాద్‌లో ప్లాట్ కొనిచ్చాడన్న ప్రచారం కూడా జరిగింది. ఆ హీరో రకుల్‌తో ప్రేమలో ఉండటం వల్లే... తన గర్ల్ ప్రెండ్ కంఫర్ట్ కోసం ఫ్లాట్ కొనిచ్చాడన్న వార్తలు వచ్చాయి. అప్పటిదాకా రెంట్ హౌజ్ లోనే ఉన్న రకుల్.. ఆ తర్వాత సదరు హీరో కొనిచ్చిన ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయిందంటారు. మరి ఆ హీరో ఎవరు? అన్న దానిపై కూడా ఇంతవరకు క్లారిటీ లేదు.