A Man Harmed TV actress in the name of tv chance.
సినిమా అవకాశాల పేరుతో వర్ధమాన నటుల్ని, సినిమా అవకాశాల కోసం ఎదురుచొస్తున నటుల్నిలైంగికంగా వేధించడం ఎక్కువవుతోంది. కాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటులు, హీరోయిన్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. రవితేజ సినిమాలో అవకాశం అంటూ ఓ టివి నటికి నమ్మ బలికిన ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
ఇలాంటి ఘటనలపై ప్రముఖులంతా గళం విపుతున్నారు. చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన అనుభవాలని మీ టూ హ్యాష్ టాగ్ ద్వారా పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
హీరోయిన్ కావాలని కలలుకనే అమ్మయిలు, సినీ ఇండస్ట్రీలో నటిగా రాణించాలని ఆశపడే మహిళలే కామాంధులకు టార్గెట్ గామారుతున్నారు. సినీ అవకాశాల పేరుతో వారిని మోసం చేసి లైంగికంగా వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలాంటి ఘటనే తాజగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టివి నటిపై ఓ వ్యక్తి లైంగికంగా దాడికి తెగబడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.