Surprise Me!

కర్ణాటక చరిత్రలో సిద్దరామయ్య చరిత్ర

2018-03-28 491 Dailymotion

Chief minister Siddaramaiah, who took charge in May 2013, is set to finish his full term of five years – the first Karnataka CM to do so in last 40 years.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చరిత్ర సృష్టించారు. ఐదు సంవత్సరాలు ఎలాంటి అటంకాలు లేకుండా పూర్తికాలం సీఎం గా పని చేసిన కర్ణాటక మూడవ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రికార్డు సృష్టించారు.
కర్ణాటకలో 2013 మే నెలలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారీతో అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ అధిష్టానం ఆదేశాలతో 2013 మే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు 2018 మే 12వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
2013 మే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్దరామయ్య 2018 మే 15వ తేదీ వరకు సీఎంగా ఉంటారు. కన్నడిగులు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే సిద్దరామయ్య మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉంది.
గత 40 ఏళ్లుగా కర్ణాటకలో ఐదు సంవత్సరాల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తిగా సిద్దరామయ్య నిలిచిపోయారు. 40 ఏళ్ల క్రితం (1972 నుంచి 1977 వరకు) కర్ణాటక ముఖ్యమంత్రిగా డి. దేవరాజ అరుసు మాత్రమే ఐదు సంవత్సరాల పూర్తికాలం సీఎంగా ఉన్నారు.
1999లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆసమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం. కృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అండతో 2004 వరకు ఎస్ఎం. కృష్ణనే సీఎంగా ఉన్నారు. ఐదు సంవత్సరాల పూర్తి కాలం సీఎంగా ఉండే చాన్స్ ఉన్నా ఎస్ఎం. కృష్ణ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆయన ఐదేళ్ల పదవి కాలం పూర్తి చేసుకోలేకపోయారు.
కర్ణాటక చరిత్రలో ముగ్గురు మాత్రం ఐదు సంవత్సరాల సీఎం పదవిని అనుభవించారు. ఎస్. నిజలింగప్ప, డి. దేవరాజ అరసు తరువాత సిద్దరామయ్య తన పదవి కాలం పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు.