Surprise Me!

కన్నడ యాంకర్ చంద్రశేఖర్ దుర్మరణం

2018-05-26 5,876 Dailymotion

Popular Kannada anchor Chandan aka Chandrashekhar and his friend Santhoshi yesterday in a road which happened at Hanagavadi near Harihara in Davangere district in Karnataka. Other two people, who were accompanying them are severely and are in critical condition. Both are treated in a private hospital.
# Chandrashekhar

ప్రముఖ కన్నడ యాంకర్ చందన్ అలియాస్ చంద్రశేఖర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని దావణగేరే జిల్లాలోని హరిహర సమీపంలోని హనగవాడి‌లో చోటుచేసుకొన్నది. ఈ ప్రమాద ఘటనలో చందన్ ఫ్రెండ్ సంతోషి కూడా మృత్యవాత పడ్డారు. చందన్ మరణవార్తతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చందన్ మృతిపై సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మీడియా కథనాల ప్రకారం.. చందన్ హుబ్బలి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేపట్టారు.
టెలివిజన్ రంగంలోనే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించారు. అత్యంత ప్రజాదరణ పొందిన పోర్కి చిత్రంలో కూడా ఆయన నటించారు. ఆయన వయసు 34 సంవత్సరాలు.
దివంగత దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, ఆయన సతీమణి శ్రీమతి పార్వతమ్మ రాజ్‌కుమార్‌తో చందన్ చేసిన ఇంటర్వ్యూలో అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఇక పోర్కి చిత్రంలో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌తో కలిసి చందన్ నటించారు