Class Room Roof Fell Down in Kadapa : కడపలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో, తరగతి గదుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని గతనెలలోనే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం వహించారు. దాని ఫలితమే మంగళవారం అదే పాఠశాల పైకప్పు పెచ్చులూడిపడటంతో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనిపై తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండు చేశాయి. మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.