Ganesh Idols Making In Dhoolpet : ధూల్‌పేట హైదరాబాద్ వాసులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఎందుకంటే ఏటా గణేష్ చతుర్థికి అడుగు నుంచి 60 అడుగుల వినాయక ప్రతిమలు ప్రాణం పోసుకునేది ఇక్కడే మరి. సీజన్ వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఏ ఇంట చూసినా వినాయక విగ్రహాలు తయారు చేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా విగ్రహాల తయారీలోనే నిమగ్నమైపోతారు. గణేష్ ఉత్సవాలకు మరో రెండు నెలల మాత్రమే గడువు ఉండటంతో ప్రస్తుతం ధూల్‌పేటలో వినాయక విగ్రహాల సందడి నెలకొంది.