Police Seized Ganja In Miryalaguda : భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. రెండు కార్లలో తరలిస్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేసిన పోలీసులు 140.585 కిలోల గంజాయిని, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వివరించారు.