Gurukul Student Died In Suryapet : గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సరస్వతి మరణానికి కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. సరస్వతి ఇంట్లో ఒకరికి బీసీ గురుకుల సొసైటీలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.