Father AND Son Trapped In Flood Water : వాగులో కొట్టుకుపోతున్న తండ్రి, కుమారులను స్థానిక యువకులు సాహసం చేసి కాపాడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రం శివారులోని పాకాల చెక్ డ్యామ్‌పై చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఓ వ్యక్తి, తన కుమారుడితో ద్విచక్రవాహనంపై పాకాల చెక్ డ్యాం పైనుంచి వెళ్తుండగా నీటి ప్రవాహానికి వాహనం అదుపుతప్పి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానిక యువకులు హుటాహుటిన నీటి ఉద్ధృతిలో సాహసం చేసి ఇద్దరితో పాటు వాహనాన్ని సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తండ్రి, కొడుకులిద్దరూ ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీచ్చుకున్నారు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఆ యువకులను స్థానికులు అభినందించారు.