Interstate Drug Peddlers Arrest : రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటికి పైగా విలువైన హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించే క్రమంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హాష్ ఆయిల్ తయారీకి ఉపయోగించిన గంజాయి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.14 కోట్ల వరకు ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.