Crops Are Being Destroyed by Deer : చూడముచ్చటైన అందంతో చెంగు చెంగున జింకలు గంతులేస్తుంటే చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. పచ్చని అడవుల్లో అవి పరిగెడుతుంటే ఎంతటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలే రైతులే పాలిట శాపంగా మారాయి. పంటలపై దాడి చేస్తూ కర్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.