Surprise Me!

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆందోళనలు

2024-09-12 0 Dailymotion

Harish Rao About Kaushik Reddy Issue : ఇందిరమ్మ రాజ్యం అంటే విపక్ష ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లి దాడి చేయడమేనా అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై అరెకపూడి గాంధీ, ఆయన అనుచరుల దాడిని తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సహా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని నిరసన తెలిపారు. హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్ని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి సీపీ కార్యాలయం నుంచి తరలించారు. అటు అరెకపూడి గాంధీ సహా 15 మందిపై గచ్చిబౌలి పోలీసులు ఎప్ఐఆర్ నమోదు చేశారు.