Balapur Laddu Auction 2024 : గణేశుడి పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులోనూ వేలంలో రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందాడు బాలాపూర్ గణేశుడు. గతేడాది రూ.27 లక్షలు పలికిన ఈ లడ్డూను, ఈసారి రూ.30.1 లక్షలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు.