ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిషేధిత భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వైసీపీ హయాంలో అసైన్డ్, చుక్కల భూమలు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు వారికి అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో 34 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో లక్షా 92 వేల ఎకరాలు నిషేదిత జాబితా నుంచి తొలగించారు. కల్యాణదుర్గంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములకు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.