Police Investigation on Rowdy Sheeter Borugadda Anil in Guntur : రౌడీషీటర్, వైఎస్సార్సీపీ సానుభూతి పరుడైన బోరుగడ్డ అనిల్‌కుమార్ పోలీసుల విచారణకు సహకరించకుండా, సరైన సమాధానాలు చెప్పకుండా వాస్తవాలు దాస్తున్నట్లు తెలుస్తోంది. కర్లపూడి బాబు ప్రకాష్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వగా గుంటూరు అరండల్ పేట పోలీసులు రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు.