Repalle to Bapatla Railway Line Survey Orders were issued with Approval : కృష్ణా జిల్లాలో కీలకమైన రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్‌కు తొలి అడుగుపడింది. 45.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మచిలీపట్నం-రేపల్లె మధ్య చేపట్టబోయే 45.30 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వేలైను పనులకు సంబంధించి ఎఫ్ఎల్ఎస్ (FLS) చేపట్టేందుకు ఆగస్టులో రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది.