Surprise Me!

'అసెంబ్లీకి రాని జగన్​కి రాజకీయ పార్టీ ఎందుకు'

2024-11-08 1 Dailymotion

MLC Bhumireddy Ram Gopla Reddy About YSRCP Boycott Graduates Constituency MLC Election : ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలు చేయచ్చు అనేది జగన్​కి తెలిసినట్లు మరెవరికీ తెలియదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జగన్ ఎందుకు దూరంగా ఉంటున్నారని నిలదీశారు. గౌతమ్ రెడ్డి అభ్యర్థి అని ప్రకటించి ఎందుకు జగన్ వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి రాకుండా ఇక జగన్​కి రాజకీయ పార్టీ ఎందుకని రాంగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. పులివెందుల ప్రజా సమస్యలు పరిష్కరించలేని జగన్​కి జీతం ఎందుకని నిలదీశారు. వెంటనే జగన్ రాజీనామా చేస్తే పులివెందులకి మరో ఎమ్మెల్యే వస్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం సిగ్గుచేటని భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.