Margadarsi Chit Fund New Branch : రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకుని మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ తెలంగాణలో కొత్తగా మూడు శాఖలను ప్రారంభించింది. వనపర్తి, శంషాబాద్, హస్తినాపురంలో ఏర్పాటు చేసిన శాఖలను సంస్థ ఎండీ శైలజాకిరణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సేవలు అందిస్తున్న మార్గదర్శి, నేటితో నాలుగు రాష్ట్రాల్లో 118 శాఖలకు విస్తరించింది.