Surprise Me!

మీరు రియల్​గా సూపర్​ మ్యాన్​, స్పైడర్​ మ్యాన్​లను

2024-11-17 0 Dailymotion

Comic Con Exhibition 2024 : హైదరాబాద్​ హైటెక్స్​ వేదికగా జరుగుతున్న కామిక్​ కాన్​ ఇండియా పాప్​ కల్చర్ ఈవెంట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వారాంతం కావడంతో కామిక్​ పుస్తక ప్రియులు, ఆర్టిస్టులు, యానిమే ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కో స్టాళ్లలలో ఒక్కో రకమైన కామిక్​లను నిర్వాహకులు ప్రదర్శించారు. యువత తమ అభిమాన కామిక్​ల వేషధారణలను ధరించి సందడి చేశారు.

సూపర్ మాన్, స్పైడర్ మాన్, హల్క్, ఐరన్ మ్యాన్ ప్రెడేటర్, బ్యాట్మాన్.. ఇలా విభిన్న కార్టూన్ క్యారెక్టర్ల వేషధారణలతో వచ్చిన యువతతో హైదరాబాద్​లోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. శుక్రవారం ప్రారంభమైన హైదరాబాద్ కామిక్ కాన్ షో ఇవాళ్టితో ముగియనుంది. రెండో రోజు ప్రదర్శనలు అన్ని వయసుల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. కామిక్-కాన్ రూపొందించిన ఈ ఫెస్టివల్లో యాక్షన్, అడ్వెంచర్, యానిమేషన్, కామిక్స్-ఓరియెంటెడ్, డాక్యుమెంటరీ, హారర్, సస్పెన్స్, హాస్యం, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, షార్ట్ -లాంగ్ ఫిల్మ్​స్​ ఉన్నాయి.