Surprise Me!

వంతెన ఎత్తు పెంచండి మహా ప్రభో - 15 ఏళ్లుగా భరించలే

2024-12-19 3 Dailymotion

Vemuluru Bridge Submerged due to Backwaters of Somasila : వైఎస్సార్ జిల్లాలోని వేములూరు వంతెనను సోమశిల వెనుక జలాలు, సగిలేరు నది నీరు ముంచెత్తాయి. దీంతో వంతెనపై ప్రజలు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలు కారణంగా పెన్నా నది నీరు సోమశిల జలాశయంలో వచ్చి చేరుతొంది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయంలో 73 టీఎంసీల నీటిని నిలువరించారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. సోమశిల జలాశయంలో నీటిమట్టం పెరిగినప్పుడల్లా వెనుకవైపున ఉన్న వేములూరు వంతెన మునిగిపోతుంది. ఇలా కొన్ని నెలల పాటు నీరు నిలబడి ఉంటంవల్ల వంతెనపై పాచీపట్టి పాదచారులు ప్రమాదవశాత్తు కిందపడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు.