Surprise Me!

పెళ్లిళ్లపై అనాసక్తి చూపుతున్న నేటి యువత - ఉద్యోగాల వేటలో 30 దాటుతున్న డోంట్​ కేర్

2025-02-03 1 Dailymotion

Youth not Intrested on Marriage : పెళ్లి అందరికీ ఒక కల. డెస్టినేషన్ వెడ్డింగ్, వింటేజ్ వెడ్డింగ్, మోడ్రన్ వెడ్డింగ్. ఇలా పేరు ఏదైనా గమ్యం ఒక్కటే పెళ్లి. ఆ పెళ్లికి సరైన వయసంటూ ఒకటి ఉందండోయ్ చట్టప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తి అయితేగానీ చేయకూడదు. అయితే వయసు మూడు పదుల దగ్గరికి వస్తున్నా పెళ్లి వంక చూడకుండా కొంతమంది కెరీర్ బిల్డింగ్ అంటూ పరుగులు తీస్తున్నారు. వృత్తిపరంగా ఎదగడం సంతోషమే కానీ, అందుకు పెళ్లిని, సరైన వయసును త్యాగం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అసలు సరైన సమయంలో పెళ్లి ఎందుకు చేసుకోవాలి. చేసుకోకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్యాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.