Surprise Me!

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో నిందితులకు రిమాండ్‌

2025-02-10 3 Dailymotion

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక ముందడుగు పడింది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో నలుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. రాత్రి 10న్నరకు నిందితులను రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశ పెట్టారు. వారికి ఈ నెల 20 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఏఆర్‌ డెయిరీ పేరుతో శ్రీవైష్ణవి డెయిరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్‌ తేల్చింది.