Housewarming in Green Grace Apartment : వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణ గుంటూరులో నిర్మించిన గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయంలో ఓ ప్లాట్ యజమాని గుట్టుగా ఆదివారం గృహప్రవేశం చేయడం చర్చనీయాంశమైంది. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ పనుల నిలుపుదల ఉత్తర్వులు ఉండగానే గృహ ప్రవేశం చేయటం వివాదాస్పదంగా మారింది. స్టాప్ ఆర్డర్ ఉండగానే ప్లాట్ నిర్మాణ పనులు చేసి గృహ ప్రవేశం చేయటంపై నగరపాలక వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జీఎంసీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.