KTR Fire on CM Revanth Reddy About Rythu Bharosa : స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని, ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో జరిగిన బీఆర్ఎస్ రైతుదీక్షలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ వారికి ఏమీ చేయలేదని, సొంత ఊరు, అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఏమైనా చేశారా అని అడగడానికి ఇక్కడకు వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.