Surprise Me!

ఫాంహౌస్​లో కోడి పందెం కేసు - మరోసారి పోలీసుల విచారణకు ఎమ్మెల్సీ పోచంపల్లి

2025-03-14 2 Dailymotion

MLC Pochampally Srinivas Reddy : ఫాంహౌస్​లో కోడిపందేల కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ పోలీసులు ఆయనను వివిధ అంశాలపై విచారించారు. ఫిబ్రవరి 11న తొలకట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్​రెడ్డి ఫాంహౌస్​లో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్​వోటీ, మొయినాబాద్​ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.