Pratibha Got ranks in Telangana Groups : ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్, స్నేహితులందరూ సాఫ్ట్‌వేర్లుగా సెటిలైయ్యారు. అందుకు భిన్నంగా పోటీ పరీక్షల వైపు అడుగేసింది. అయితే, ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం చేయట్లేదా? మరి ఏం చేస్తున్నావు? పెళ్లెప్పుడు? అనే ప్రశ్నలే ఎదురయ్యేవి. కాస్త నిరూత్సహంగా అనిపించినా ఏమాత్రం తలొగ్గలేదా యువతి. ప్రభుత్వ ఉద్యోగమే పరమావధిగా ప్రిపరేషన్ మొదలు పెట్టింది. తెలంగాణ గ్రూప్స్ ఫలితాల్లో గ్రూప్-1,2,3,4 అన్నింటిలో ఉత్తీర్ణత సాధించి విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటోంది.