Urkondapeta Woman Rape Case : నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చిన వారు భార్యాభర్తలు కాదని తెలుసుకున్న దుండగులు ఓ మహిళను బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఆలయ సమీపంలో మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ప్రదేశాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. కల్వకుర్తి సీఐ నాగార్జున, ఊర్కొండ ఎస్సై కృష్ణదేవ నుంచి ఆయన వివరాలు సేకరించారు.