Bhupalpally Youngster Gopi Krishna Got Ten Government Jobs : 7,3 కలిపితే ఏంతని స్నేహితులు అడిగితే ఏం చెబుతావు? ఆ మాత్రం తేలిదా 10 అని ఠక్కున జవాబిస్తావు. కానీ, ఇప్పుడు చెప్పే 10 గురించి వింటే అవక్కవ్వాల్సిందే. ఎందుకంటే, అది కేవలం 10 మాత్రమే కాదు. ఓ యువకుడు సాధించిన ప్రభుత్వ ఉద్యోగాల నంబరు. అన్ని ఉద్యోగాలా అనిపిస్తుంది కదా! అవును మరి, అందులో 7 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు ఉన్నాయి. ఆ 10 సర్కారీ కొలువుల సాధకుడు భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లి గ్రామానికి చెందిన గోపీకృష్ణ. నీలో ఎంత ప్రతిభ ఉన్నా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తెనే ఉన్నత స్థాయికి చేరుకుంటావు అనే దానికి ఇతనే ఆదర్శం.