Group-1 53rd Ranker Rohila Interview : చాలామంది చదువు పూర్తి కాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్ రావడం గొప్పగా భావిస్తారు. వెంటనే అందులో చేరిపోతారు. కానీ ఆ యువతి మాత్రం అందుకు భిన్నమంటోంది. గ్రూప్-2 ఆఫీసర్లైన తన తల్లిదండ్రుల ప్రేరణతో సాప్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. 5 ఏ ళ్లుగా తాను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1ఫలితాల్లో 53వ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది.