Heavy Rains In Hyderabad : హైదరాబాద్‌లో పలుచోట్ల కురుస్తున్న వర్షం కురుస్తోంది. మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, అల్వాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో వర్షం విస్తారంగా కురుస్తోంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కేవలం హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోనూ చిరుజల్లులు పడుతున్నాయి. నర్సంపేట, ఖానాపురం మండలాల్లోనూ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడుస్తోంది.