Surprise Me!

విద్యుత్ వెలుగుల మధ్య మెరిసిపోయిన హుస్సేన్​సాగర్‌ - వావ్ అనిపించేలా డ్రోన్‌ దృశ్యాలు

2025-09-07 8 Dailymotion

Ganesha Immersion in Hussain Sagar : వినాయక నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కు గణనాథుని విగ్రహాలు భారీ సంఖ్యలో తరలివచ్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా వెలుగు జిలుగులలో శనివారం రాత్రి సమయంలో శోభాయమానంగా మారింది. సచివాలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతులతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హుస్సేన్​సాగర్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. క్రేన్​ల ద్వారా వినాయక విగ్రహాలు గంగమ్మ ఓడికి చేరుతున్న తీరును ఆసక్తిగా తిలకించారు. సచివాలయం నుంచి మొదలుకొని ఎన్టీఆర్​ మార్గ్​, నెక్లెస్​రోడ్​ వరకు సందడి వాతావరణం నెలకొంది. నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రోలో రద్దీ తీవ్రంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 2.61 లక్షల గణేశ్‌ ప్రతిమల నిమజ్జనం పూర్తయ్యింది. సచివాలయం, అమరవీరుల స్తూపం, రాజీవ్​ గాంధీ విగ్రహం, ప్రసాద్​ ఐమ్యాక్స్​ థియేటర్, బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహం నెక్లెస్​ రోడ్​ వంటి ప్రాంతాలను చూస్తూ ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. 

రాత్రంతా వినాయక నిమజ్జనాలు - విద్యుత్ కాంతుల మధ్య వెలిగిపోయిన హుస్సేన్​సాగర్

హుస్సేన్‌సాగర్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి 'గణపతి బప్పా మోరియా'